వరంగల్ జనంసాక్షి : జిల్లాలోని మెంర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో అర్థరాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పెళ్లి బృందం వర్ధన్నపేట మండలం డీసీ తండా నుంచి ఖానాపురం మండలం వజినేపల్లి తండాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.




