.
ఎమ్మెల్యే రసమయి…
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 18
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం లోని, శంకరపట్నం మండల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను వీనస్ ఆసుపత్రి యజమాన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. శనివారం మండలంలోని కేశవపట్నం మెయిన్ రోడ్డుపై వీనస్ ఆసుపత్రి యజమాన్య
నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక రథసారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్న వీనస్ ఆసుపత్రి యజమాన్యం కేశవపట్నం గ్రామంలో కార్పొరేట్ స్థాయిలో ప్రతి యూనిట్లు ఏర్పాటు చేసి, కార్పొరేట్ వైద్య సేవలు అందించుటకు ముందుకు వచ్చినందుకు ఆస్పత్రి యజమాన్యాన్ని అభినందించారు. మండల ప్రజలు ఆస్పత్రి వైద్య సేవలను వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య గౌడ్, శంకరపట్నం మాజీ జెడ్పిటిసి కాంగ్రెస్ పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వీరస్వామి, కొత్తగట్టు మచ్చ గిరిజన దేవస్థానం మాజీ చైర్మన్ శ్యామ్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కోటిలింగం, కుమార్, రవి, కార్యకర్తలు కేశవపట్నం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఆసుపత్రి యజమానులు మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం మండల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి..




