Thursday, 5 November 2026

సింగరేణిలో 10 లక్షల గ్రాట్యుటీ పై సీలింగ్ తీసివేసి 20 లక్షలు వెంటనే చెల్లించాలి. -టిఎన్టియుసి

బెల్లంపల్లి, మార్చి 18, (జనంసాక్షి )
సింగరేణిలో పదోవ వేతన కాలపరిమితి ముగిసి నెలలు కావస్తున్నా పదవ వేతన ఒప్పందంలోని ఉన్న సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి సింగరేణి యజమాన్యం సింగరేణిలో పనిచేసే రిటైర్డ్ అయిన కార్మికులకు తేదీ 1-1 2017 నుండి పదిలక్షల గ్రాటిటీపై గ్రాడ్యుటీపై సీలింగ్ తీసివేసి 20 లక్షలు కట్టి ఇవ్వాలని టిఎన్టియుసి అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ టి.మణిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో 14 రకాల అలవెన్స్ లలో ఇన్కమ్ టాక్స్ రద్దుచేసి సింగరేణిలో కోల్ ఇండియాలో మాదిరిగా ఇక్కడ కూడా కట్టి ఇవ్వాలన్నారు. కార్మికులు రిటైర్డ్ అయిన వెంటనే అతనికి వచ్చే టర్మినల్ బెనిఫిట్స్ అదే రోజు వెంటనే ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ ను రద్దుచేసి ప్రభుత్వమే భరించాలన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటీకరణ రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి హై పవర్ వేతనాలు ఇవ్వాలన్నారు. 11వ వేతన ఒప్పందం 50 శాతం వరకు ఇవ్వాలని లేనియెడల సింగరేణి హెడ్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.మణి రామ్ సింగ్, ఉపాధ్యక్షులు గద్దెల నారాయణ, బొల్లు మల్లయ్య, కల్లుగీత కార్మిక సంఘం నాయకుడు గంగాధర్ గౌడ్, నాయకులు శంకరయ్య, ఎండి హసన్, బి రవి తదితరులు పాల్గొన్నారు