Tuesday, 3 November 2026

శంకర్‌రావుకు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నాం : వైద్యులు

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్‌రావు ఒత్తిడి వల్ల హైబీపీకి గురయ్యారని కేర్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐసీయూలోనే ఆయనకు చికిత్సను కొనసాగిస్తున్నామని  చెప్పారు. బైపాస్‌ సర్జరీ అయినందువల్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ఫీల్డ్‌ భూముల వ్యవహారం కేసులో విచారించేందుకు నిన్న శంకర్‌ రావును పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం మొదటి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేర్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *