Wednesday, 4 November 2026

చైనాలో బాణాసంచాతో వెళ్తున్న ట్రక్‌లో పేలుడు : 26 మంది మృతి

బీజింగ్‌: చైనాలోని హెనాన్‌ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బాణాసంచాతో వెళ్తున్న ఓ ట్రక్‌లో ప్రమాదం చోటుచేసుకొని పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాన్‌మెంగ్జియా జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి బ్రిడ్జి దెబ్బతింది. పేలుడు అనంతరం వెనకవస్తున్న పలు వాహనాలు బ్రిడ్జి నుంచి కిందికిపడిపోయాయి. ఘటనాస్థలంలో అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *