Wednesday, 4 November 2026

శంషాబాద్ లో బంగారం పట్టివేత

 హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఆదివారం బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర 500 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కాగా… బంగారం అక్రమ దిగుమతికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఓ అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల కాలంలో విదేశాల నుంచి హైదరాబాద్‌కు విచ్చేసిన వారి దగ్గర్నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *