
గద్వాల నడిగడ్డ, జూన్ 23 (జనం సాక్షి);దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసిన సమాచార శాఖ సిబ్బంది పత్రికా విలేకరులకు జిల్లా అదనపు కలెక్టర్ చౌహన్ అభినందనలు తెలిపారు. శుక్రవారం నూతన ఐ డి ఓ సి కార్యాలయంలో డి పి ఆర్ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా అదనపు కలెక్టర్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డి పి ఆర్ ఓ చెన్నమ్మ, కార్యాలయ సిబ్బంది అదనపు కలెక్టర్ కు సన్మానం చేశారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమపథకాలు కార్యక్రమాల పట్ల ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసి సహకార మందించాలని అదనపు కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ చెన్నమ్మ, కార్యాలయ సిబ్బంది షాకీర్ నవాజ్, జావిద్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.




