Wednesday, 4 November 2026

శనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు

 

 

 

 

 

 

 

బషీరాబాద్ ఫిబ్రవరి 8,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నావంద్గి ఆవరణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనిగలు కొనుగోలు కేంద్రాన్ని పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి మాట్లాడుతూ శనగలు క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర 5, 335 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని,మన తాండూరు నియోజకవర్గంలో మొదటగా బషీరాబాద్,కొడంగల్,పరిగి, కోట్ పల్లి మండలాలలో ఏర్పాటు చేశామని రైతులు పత్తి కంది పంటలు వేసి పంట నష్టం జరిగినందుకు,రైతులు ప్రత్యామ్నాయ పంటగా శనగలు పండించారని రైతుల కోసం ఆలోచన చేసి ఈ శనిగలు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. రైతులు నాణ్యమైన శనగలను తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్,జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి,సీఈవో వెంకటయ్య,గ్రామ సర్పంచ్ పూడూరు ప్రియాంక,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్ సింగ్ తన్వార్,కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రజాక్,పిఎసిఎస్ డైరెక్టర్లు,తదితరులు పాల్గొన్నారు.