Wednesday, 4 November 2026

ధరణి సహాయక కేంద్రం ఏర్పాటు

 

 

 

 

 

 

 

 

బషీరాబాద్ ఫిబ్రవరి 8,(జనం సాక్షి)బషీరాబాద్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ధరణి సహాయక కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ ఎన్.వెంకట్ స్వామి మాట్లాడుతూ బషీరాబాద్ మండలానికి చెందిన ప్రజలు ఏదైనా ధరణికి సంబంధించిన సమస్యలు ఉంటే ఉదయం 10:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధరణి సహాయక కేంద్రం వద్దకు వచ్చి వీఆర్ఏ హైమద్ వద్ద వారికు సంబంధించిన అప్లికేషన్స్ ఇవ్వాలని తెలిపారు.అదేవిధంగా ప్రతి సోమవారం ధరణి ప్రజావాణి కార్యక్రమం తహశీల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇందుకు సమయం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ప్రజావాణికి సంబంధించిన ఫిర్యాదులు తీసుకోబడతాయి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.