Tuesday, 3 November 2026

శాంతిఖని ఉద్యోగులకు యూనిఫామ్ ల పంపిణీ.

శాంతిఖని ఉద్యోగులకు యూనిఫామ్ ల పంపిణీ.
బెల్లంపల్లి, డిసెంబర్ 2, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని షాఫ్ట్ ఆవరణలో శుక్రవారం గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా గని ఉద్యోగులకు సింగరేణి సంస్థ అందించే యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఉద్యోగులు అందరూ విధిగా యూనిఫామ్ ధరించి విధులకు హాజరు కావాలని మరియు హెల్మెట్ కూడా ధరించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రక్షణ అధికారి పి రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, టీబీజీకెఎస్ పిట్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటియుసీ పిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, ఉద్యోగులు పాల్గొన్నారు.