బెల్లంపల్లి, మార్చ్ 13, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో సోమవారం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్మికుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. స్వీట్లు పంచి పెట్టారు. కవిత ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకుడు రాజనాల రమేష్, కమిటీ సభ్యులు సూరం మల్లేష్, ప్రేమ్ కుమార్, దాడి రమేష్, కొట్టె రమేష్, మీస అంజయ్య, ఎస్ సాజన్ మరియు గని కార్మికులు పాల్గొన్నారు.
శాంతిఖని గనిలో కవిత జన్మదిన వేడుకలు.




