Thursday, 5 November 2026

శాంతిభద్రతలకు పెద్దపీట

dgyolobhహైద‌రాబాద్ (జ‌నంసాక్షి): శాంతిభద్రతలకు రాష్ర్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి. రాష్ట్రంలో 690 పోలీసు స్టేషన్లకు బ్రాండ్ వాహనాలు ఇవ్వడం దేశంలోనే మొదటిసారి అని చెప్పారు. హైదరాబాద్ లోని ప్రతి కూడలిలో పోలీసులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో పోలీసు వాహనాల కొనుగోలుపై విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాయిని సమాధానం చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా పోలీసు శాఖను ఆధునీకరించిన సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *