Wednesday, 4 November 2026

శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌ : నవంబర్‌ 5, (జనంసాక్షి):
నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ అన్నారు. నగరంలో అనవసర వదంతులు వ్యాపిస్తున్నాయని, వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అల్లర్లకు కారణమైన 35 మందిని అరెస్టు చేశామన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతామని అన్నారు. సామాజిక  జీవనంలో అందరూ ఐకమత్యంగా జీవించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *