శాసనమండలి అరగంట వాయిదా
హైదరాబాద్: శాసన మండలి ప్రారంభమైన కాసేపటికే అరగంటపాటు వాయిదా పడింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రి వర్గం సిఫార్సులను సభ ముందు ఉంచాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. అయితే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం మండలిలో చర్చకు అనుమతిస్తామని మంత్రి ఆనం సభకు తెలియజేశారు. సభలో ఆందోళన కోనసాగించారు. దీంతో ఛైర్మన్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.



