శాసన మండలి డిసెంబర్‌ 10 కి వాయిదా

హైదరాబాద్‌: శాసన మండలి డిసెంబర్‌ 10కి వాయిదా పడింది. ఇవాళ ఉదయం ప్రారంభంకాగానే ఎస్సీ, ఎస్టీ నిధులపై కేబినెట్‌  సబ్‌కమిటీ తయారు చేసిన ముసాయిదాసు సభలో ప్రవేశపెట్టాని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. సాంకేతికంగా అది సాథ్యం కాదని, శాసన సభలో ప్రవేశపెట్టిన తర్వాత మండలిలో ప్రవేశపెతామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెప్పినా సభ్యులు తమ పట్టువీడలేదు. దీంతో మండలి ఛైర్మన్‌ సభను డిసెంబర్‌ 10కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.