అమరావతి: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఈరోజు శాసనసభకు హాజరయ్యారు. గుండెపోటుతో రెండు రోజుల క్రితం మృతిచెందిన భూమా నాగిరెడ్డికి ఈరోజు శాసనసభ సంతాపం ప్రకటించింది. భూమాతో తమకున్న అనుబంధం, ప్రజలకు ఆయన చేసిన సేవలను సభ్యులు గుర్తుచేసుకున్నారు.తన తండ్రికి సంతాపం ప్రకటిస్తున్న నేపథ్యంలో అఖిలప్రియ సభకు హాజరయ్యారు.