హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం వివిధ పార్టీలు స్పీకర్‌కు తమ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. ఏపీపీఎస్సీ ప్రక్షాశనపై తెదేపా వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. చలో అసెంబ్లీ సందర్భంగా మగ్దూం భవన్‌పై పోలీసుల దాడి, తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులపై సీపీఐ, వీఆర్‌ఏ సమస్యలపై సీపీఎం, తెలంగాణ తీర్మానం, చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులపై తెరాస, చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులు, కేసులపై భాజపా, రైతులకు విత్తనాలు, పెరుగుతున్న ఎరువుల ధరలపై వైకాపా, చలో అసెంబ్లీ సందర్భంగా అక్రమ అరెస్టులపై నాగం జనార్దన్‌రెడ్డి వాయిదా తీర్మానాలను ఇచ్చాయి.




