హైదరాబాద్ : ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు డిమాండ్ చేస్తూ గస్‌పార్కు వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ అనర్హులైన సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం నేటికీ విచారణకు అదేశించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలంగాణ తెదేపా ఫోరం నేత ఎర్రబెల్లి చెప్పారు. ఏపీపీఎస్సీ సభ్యులు తీసుకుని నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు అరోపించారు.




