హైదరాబాద్,(జనంసాక్షి): శాసనసభ ఇన్నర్ లాబీల్లోకి సభ్యులు కానివారు ప్రవేశించడంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు కానివారిని ఇన్నర్ లాబీల్లోకి అనుమతించొద్దని సిబ్బందికి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. బయటవారిని వెంటపెట్టుకుని ఇన్నర్‌లాబీల్లోకి రావద్దని శాసనసభ్యులకు స్పీకర్ సూచించారు.




