హైదరాబాద్: జెన్‌కో, మెట్రోరైలు, గృహ నిర్మాణశాఖలపై సమీక్షించేందుకు మంగళవారం శాసనసభ కమిటీ హాలులో ప్రభుత్వ సంస్థల కమిటీ సమావేశమైంది. జెన్‌కో నుంచి రైల్వేశాఖకు అదనంగా చెల్లించిన రూ. 9కోట్ల వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. మెట్రో రైలు కోసం ఎల్ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం ఇస్తున్న భూముల వివరాలు ఇవ్వాలని కమిటీ కోరింది.




