Thursday, 5 November 2026

నడుచుకుంటూ అయినా హైదరాబాద్‌ చేరుకుంటాం : ఏపీఎన్‌జీవో

విశాఖపట్నం : ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చి 2న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 10వ వేతన సంఘాన్ని నియమించాలని కోరుతూ తాము కార్యక్రమాన్ని చేస్తున్నమని దీనిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అడ్డుకోవడం సరైంది కాదని ఏపీఎన్‌జీవో కార్య నిర్వాహక కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు మద్దతుగా తెలంగాణ జేఏసీ చేపట్టిన సడక్‌బంద్‌ కార్యక్రమాన్ని మరోరోజుకు వాయిదా వేసుకోవాలని ఏపీ జేఏసీ కోరింది. సడక్‌బంద్‌ పేరుతో తమను అడ్డుకుంటే నడుచుకుంటూ అయినా హైదరాబాద్‌ చేరుకుంటామని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఏపీఎన్‌జీవో సంఘం మాత్రమే సమైకాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసిందని ఏపీ జేఏసీకి సమైక్యాంధ్రకు సంబంధం లేదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేక ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏపీ జేఏసీలో భాగంగా ఉన్నాయని ఆయన విశాఖలో చెప్పారు. చలో హైదరాబాద్‌ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ ఆయన విశాఖలో వివిధ ఉద్యోగ సంఘాలతో సమావేశం అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *