Tuesday, 3 November 2026

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి అందోళనకు దిగారు. రైతు సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తెదేపా సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని మంత్రి శ్రీధర్‌బాబు విపక్ష సభ్యులకు సూచించారు. శాంతించకపోవడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *