Thursday, 5 November 2026

శాసనసభ వాయిదాపై తెదేపా సభ్యుల నిరసన

-విద్యుత్‌ సమస్యపై చర్చ ఎప్పుడో చెప్పేవరకు సభలోనే
హైదరాబాద్‌ : శాసనసభ వాయిదాపై తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళనతో ఇవాళ వరసగా వాయిదాలు పడ్డ శాసన సభను చివరికి స్పీకర్‌ రేపటికి వాయిదా వేశారు. దాంతో సభ వాయిదా పడినా తెదేపా సభ్యులు పోడియం వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. విద్యుత్‌ సమస్యపై చర్చ ఎప్పుడో సభాపతి స్పష్టంచేసేవరకు సభనుంచి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *