Wednesday, 4 November 2026

శిక్షణతో నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలి

డిచ్‌పల్లి: రిక్రూట్‌మెంట్‌ కానిస్టేబుళ్లందరూ అధికారులు ఇచ్చే శిక్షణతో తమ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకోవాలని, ఈ శిక్షణ విధినిర్వహణకు ఎంతో దోహదపడుతుందని ఏపీ ఎస్పీ బెటాలియన్స్‌ ఐజీ కిషోర్‌కుమార్‌ సూచించారు. డిచ్‌పల్లి మండలంలోని ఏడో బెటాలియన్‌లో రిక్రూట్‌ కానిస్టేబుల్స్‌ పరేడ్‌ను శనివారం ఐజీ స్వయంగా పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ ప్రసాద్‌బాబు, అదనపు కమాండెంట్‌లు శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *