Tuesday, 3 November 2026

శివకుమార్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఉస్మానియా విద్యార్ధిని అరుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. దాంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న శివకుమార్‌ను ఛత్రీనాక పోలీసులు పుణే నుంచి ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ తీసుకొచ్చారు. గత సంవత్సరం డిసెంబర్‌ 31న అరుణ మృతి వెలుగులోకి రాకముందే శివకుమార్‌ మహా రాష్ట్రకు పారిపోయాడు.
హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా జనవరి 4న పుణెలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకడంతో శివకుమార్‌కు తీవ్ర గాయాలైన విషయం తెలసిందే. ఈ ఘటనలో అతని కుడి  చేయి, ఎడమ కాలు నుజ్జునుజ్జు అయ్యాయి. దాంతో అతని కాలు, చేతిని వైద్యులు తోలగించారు. అప్పటి నుంచి  చికిత్స పొందుతున్న శివ కుమార్‌కు ఆరోగ్యం  కుదుట పడటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. రైలులోంచి దూకి ఆత్మహత్యకు యత్నించిందకుగాను అతనిపై పుణెలోనూ కేసు నమోదైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *