Wednesday, 4 November 2026

శివాజీ విగ్రహ స్థాపన కు భూమి పూజ

 

రాజంపేట్ జనవరి 23/ జనంసాక్షి

రాజంపేట్, మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో సోమవారం  శివాజీ విగ్రహ స్థాపనకు భూమి పూజ కార్యక్రమాన్ని ఆర్య క్షత్రియ  సంఘ అధ్యక్షులు అంకం సిద్దేశ్వర రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ సాధించిన విజయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు బిక్కజీ వీరేందర్, బిక్కజీ బాల్వంత్ రావు, మాలిష్ కమలాకర్ రావు, బిక్కజీ దిలీప్, అంకం కృష్ణారావు, బిక్కజీ భూంరావు, భాస్కర్ రావు, వెంకట్ రావు,  అరె క్షత్రియ సంఘ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.