Thursday, 5 November 2026

శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి
): పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శివాలయంలో శివరాత్రి వేడుకలకురంగం సిద్దం అయ్యింది. భక్తుల రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు  చేశారు. మంగళవారం ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ పర్వాలు స్మార్ధ సంప్రదాయంగా కొనసాగాయి.  ఉత్సవ విశిష్టతను వివరిస్తూ ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు నందీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతలందరినీ ఆహ్వానించే బాధ్యతలు అప్పగించే తతంగాన్ని చేపట్టిన పూజారులు భక్తులకు ఆశీస్సులు అందజేశారు. ఇక శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సరికొత్తగా ప్రవేశపెట్టిన వస్త్రాలలంకరణ మొక్కు నిర్వహణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వేకువజామున అభిషేకం నిర్వహించే దశలో శ్రీస్వామి అమ్మవారలకు పట్టువస్త్రాలల అలంకరణ చేసే పర్వాన్ని దేవస్థానం ప్రవేశపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *