Tuesday, 3 November 2026

శుక్రవారం అర్ధరాత్రి వరకు..!

పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను, నల్లా బిల్లు, కరెంటు బిల్లు తదితరాలను శుక్రవారం అర్ధరాత్రి వరకు పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవచ్చని రాష్ట్ర పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు తె6673417ktrలిపారు. ఈ బిల్లులకు చెల్లించే మొత్తానికి ఆదాయం పన్ను వర్తించదని కేటీఆర్ స్పష్టంచేశారు.తన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఈ మేరకు తాను చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు గెజిట్ విడుదల చేయించారని చెప్పారు. ప్రస్తుతం రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లతో గ్రామీణ స్థాయి నుంచి మున్సిపాల్టీలు, కార్పొరేషన్లవరకు పెండింగ్ పన్నులు, యుటిలిటీ బిల్లులను ప్రజలు చెల్లించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. గురువారం ఉదయం ఢిల్లీలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసిన సందర్భంగా విద్యుత్ తదితర బకాయిల చెల్లింపునకు పాత నోట్లను అనుమతించాలని విజ్ఞప్తి చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించి.. దేశవ్యాప్తంగా ఈ మేరకు అమలు చేసేందుకు గెజిట్ కూడా విడుదల చేయించడం విశేషం. మంత్రి విజ్ఞప్తితో దేశవ్యాప్తంగా ప్రజలకు అదనపు ఊరట కలిగింది. ఈ బిల్లులకు చెల్లించే మొత్తం పన్ను మినహాయింపు ఉన్న రెండున్నర లక్షల పరిధిలోకి రాదని ఆయన స్పష్టంచేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన మంత్రి కేటీఆర్.. రాత్రి ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. వివరాలు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *