Wednesday, 4 November 2026

శేఖపూర్ సర్పంచ్ కు ఉత్తమ అవార్డు

శేఖపూర్ సర్పంచ్ కు ఉత్తమ అవార్డుబిచ్కుంద మార్చి 25 (జనంసాక్షి) గ్రామపంచాయతీల్లో చేపడుతున్న పనులు, సేవలకుగాను కేంద్రప్రభుత్వం వివిధ విభాగాల్లో ఉత్తమ పురస్కారాలు అందజేసింది.గ్రామపంచాయతీల్లో చేపట్టిన వివిధ పనులు, సేవలపై ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు పంపించగా   పోస్టల్‌ ద్వారా పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పేరిట పురస్కారాలు ప్రశంసాపత్రాలను పంపించింది. ఈమేరకు శుక్రవారం నాడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే వివిధ గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఎంపీటీసి లకు పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా మద్నూర్ మండల శేఖపూర్ గ్రామానికి చెందిన గ్రామ ప్రథమ పౌరుడు కరీం పటేల్ కు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎంపీ మరియు అందరి సహకారంతో గ్రామానికి అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. మండల వాసులు ఆయనను శుభాకాంక్షలు తెలిపారు.