Thursday, 5 November 2026

శేషాచల అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్‌

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగల కోసం పోలీసులు కూంబింగ్‌ కొనసాగించారు. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎర్రచందనం దొంగలు అడవిలోనే ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. అడవి నుంచి దుండగులు బయటకు వెళ్లకుండా ప్రధాన రహదారుల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. 5 ప్రత్యేక పోలీసు బృందాలు శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫÛటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *