Tuesday, 3 November 2026

‘శైలజానాథ్‌ వ్యవహారంపై విచారణ జరపండి’

హైదరాబాద్‌, జనంసాక్షి: శైలజానాథ్‌ మనీల్యాండరింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అతని మిత్రుడు, బ్యాంకుల పాత్రిపై కూడా దర్యాప్తు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీఎం తన మంత్రివర్గాన్ని విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నారాయణ ఈ సందర్భంగా ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *