Wednesday, 4 November 2026

శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

సత్తుపల్లి RC ( జనం సాక్షి )
శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం——————————————————— జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్——————————————-తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతా చారి 14వ, వర్ధంతి వేడుకలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గ కమిటీ అధ్వర్యంలో ఆ సంఘ కార్యాలయం నిర్వహించారు. ముందుగా ఆ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతర శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి అనీ అనంతరం స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో 1200ల మంది తెలంగాణ విద్యార్థులు, మేధావులు, ప్రాణ త్యాగాలు చేస్తే దాన్లో 90 శాతం మంది బీసీ ,ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ, బిడ్డలే ఉన్నారు అని . తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుందని, తెలంగాణ ప్రతి ఇంట సంతోషాల నిండితాయని, ఆనాడు ఎంతోమంది తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్ర సాధన కోసం వారి ప్రాణాల్ని గడ్డిపుసల భావించి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. అమరవీరుల యొక్క త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ trs ప్రభుత్వం అమరవీరుల యొక్క ఆకాంక్షను నెరవేర్చున్నాడు మాత్రమే వారికి నిజమైన నివాళులు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమం లో డి.సి.సి.బి ఖమ్మం జిల్లా మాజీ డైరెక్టర్ వెలిశాల చెన్నాచారి, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెలి శ్రీనివాస్, సత్తుపల్లి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తిన్నవల్లి రంగారావు, సత్తుపల్లి నియోజకవర్గం గౌరవ సలహాదారులు చింతల సత్యనారాయణ, యువజన విభాగం సత్తుపల్లి నియోజకవర్గం అధ్యక్షులు మరీదు ప్రసాద్, కాంతారావు, నియోజకవర్గ గౌరవ సలహాదారులు బాణాల సత్యనారాయణ, రాంబాబు, బొద్దూరు అప్పారావు,తదితరులు పాల్గొన్నారు.