బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి : శామీర్ పేట్, జనం సాక్షి :
శామీర్ పేట లో బొడ్రాయి పండుగ సందర్భంగా సర్పంచ్ బాలమణి సుదర్శన్ ఆధ్వర్యంలో మురళి శర్మ పంతులు వేద పండితులతో పూజలు నిర్వహించి శనివారం బొడ్రాయి, పోతలింగ రాజుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు .మంత్రి మల్లారెడ్డి తో పాటు ఎంపీపీ ఎల్లు భాయి బాబు, జడ్పీటీసీ అనిత లాలి విచ్చేసి బొడ్రాయిని దర్శించుకొని తీర్థ ప్రసా దాలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో శామీర్ పేట సర్పంచ్ బాలామణి, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, ఉప సర్పంచ్ నర్ల రమేష్ యాదవ్ , బిఆర్ ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ , ఎంపిటిసి డపు సాయి బాబా, సొసైటీ ఉపాధ్యక్షులు ఐలయ్య యాదవ్ ,మహేందర్ యాదవ్,
కట్ట మైసమ్మ చైర్మన్ ప్రభాకర్ యాదవ్,నాయకులు ,నర్సిహ్మ రెడ్డి,
, శ్రీకాంత్ గౌడ్, రవిందర్, సత్య నారాయణ , వార్డు సభ్యులు ఉప్పలయ్య, శ్రీకాంత్ గౌడ్, బాబు , మేడి రవి, గ్రామస్థులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
3ఎస్పీటీ -1: బొడ్రాయి పూజలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
బొడ్రాయి ప్రతిష్టాపనలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి : శామీర్ పేట్




