Thursday, 5 November 2026

శ్రీధర్ బాబు కి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలి

జనంసాక్షి ,కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివార స్వామి దేవాలయం కమ్యూనిటీ హాల్ లో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనల రాజు అద్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కమాన్ పూర్ మండల సన్నాహక సమావేశనికి ముఖ్య అతిథిగా మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ హాజరయ్యారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కళ్యాణ కర్ణాటక రీజియన్ ఇంచార్జ్ గా వ్యవహరించి కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం అహార్నిషలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చేల కృషి చేసి తిరిగి మంథని నియోజకవర్గనికి వస్తున్న సందర్భంగా కమాన్ పూర్ మండలం సబ్బితం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్ ,భూoపెళ్లి రాజయ్య, సయ్యద్ ఇక్బాల్ ,షెవ్వా శంకరయ్య,ఆకుల ఓదెలు, తొగరి అశోక్ ,కటకం నారాయణ,ఎండీ అఫ్సర్,గుమ్మడి సతీష్,లింగాల కుమార్,జంగపెల్లి ఏర్రయ్య, పిడుగు శంకర్ , పిడుగు నర్సయ్య,పెరటి రాజిరెడ్డి,కోల నరేందర్ గౌడ్, గడ్డం శ్రీనివాస్,,శ్రీముర్తి, రఫీక్, ముస్తక్,కమ్మగొని మల్లయ్య గౌడ్, పెండ్యాల రాజు,కోoతం శ్రీనివాస్,పోతుల కుమార్,కోల నర్స గౌడ్,,అకేన పల్లి సుధాకర్ గౌడ్,ఈరుగురాల శేకర్,కుక్క రవి, ఈరుగురాల రాజు, వీరేశం, పరుశురాం, ,చాట్ల రాయమల్లు, రాజ్ కుమార్,అడ్వల చంద్రయ్య , చాట్ల రాయమల్లు , కనుకయ్య, బత్తుల అంజి, మతీన్ ఖాన్, బంగారు మహేష్, చింతపండు మధు, పల్లే కనుకయ్య, గుంజపడుగు రవి, రహీమ్ ,బూస తిరుపతి, పిడుగు రాజు, వడ్లకొండ మల్లయ్య గౌడ్, మామిడి రాజు, కుమ్మరి సాయి, జనగమ శేకర్ ,బతిని నరేష్ నగపురి అజయ్ తదితరులు ఉన్నారు.