శ్రీధర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు జనంసాక్షి, మంథని : ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ ర్యాలీలో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తమ నాయకుడు శ్రీధర్ బాబు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధికా ప్రతినిధి వేల్పుల రాజు మాట్లాడుతూ.. గొల్లపల్లి నుండి మంథని వరకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబుని తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. పుట్ట మధు తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి మంథని ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశావో చెప్పుకో.. అంతేగాని నువ్వు..నీ చెంచా గాళ్ళతో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఖబర్దార్ అనే హెచ్చరించారు. మంథనిలో ఎంతమంది దళితులకు.. దళిత బంధు ఇప్పించావు, మరి ఎంతమందికి బీసీ బందు ఇప్పించావు నువ్వు నీ పార్టీ వాళ్లకు తప్ప ఎవరికీ ఇప్పించావు చెప్పాలి అని అన్నారు. ఇంకొకసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై గాని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పైన గాని చెడుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సింగల్ విండో డైరెక్టర్ రవి కంటి సతీష్, నాయకులు లైసెట్టి రాజు, పార్వతి కిరణ్ పటేల్, ఖానాపూర్ మాజీ సర్పంచ్ దోరగొల్ల శ్రీనివాస్ యాదవ్, సల్మాన్ పాల్గొన్నారు.