కల్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

పెద్దవంగర ఆగష్టు 25(జనం సాక్షి )స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కెసిఆర్ నని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.శుక్రవారం మండలం లోని చిట్యాల గ్రామనికి చెందిన మొగులగాని నిర్మల, వల్లపు కవిత, గొండ్యాల శోభా, పోత్కూనూరి ఇందిరమ్మకు మంజూరు ఐనా కళ్యాణలక్ష్మి చెక్కులను గ్రామపంచాయతీ ఆవరణంలో స్థానిక సర్పంచ్ రావుల శ్రీనివాస్ రెడ్డి, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఈదురు ఐలయ్య తో కలిసి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణి చేయడం జరిగిందనీ తెలిపారు.
తరువాత ఎంపీపీ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పథకం పేదప్రజలకు ఒక వరమని, పెళ్లి చేసుకున్న పేదింటి ఆడబిడ్డలు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ నాలుగు చెక్కుల మొత్తం నాలుగు లక్షల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు.
అదేవిధంగా గ్రామానికి చెందిన పెందోటా సోమయ్యకు సీఎం సహాయనిధి నుండి మంజూరు 27500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కూడా పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లస్కర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొల్లూరి రమేష