క్యాండి: టీ 20 సూపర్ 8 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి శ్రీలంక ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో నికోల్ 58, గుప్తిల్ 38, మెకల్లం 25, టేలర్ 23 పరుగులు చేశారు. శ్రీలంక బౌలింగ్‌లో కులశేఖర, పెరెరా చెరో రెండు వికెట్లు తీయగా, మలింగ, మెండిస్ చెరో వికెట్ తీసుకున్నారు.




