చిలకలూరిపేట టౌన్ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి.
సుదర్శనం : అక్టోబర్ 1నుంచి అక్టోబర్ 29 తేదీ వరకు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 30వ తేదీకి శుక్రవారం జారీ ౄచేస్తారు
కాటేజి : అక్టోబర్ 30వ తేదీకి శుక్రవారం జారీ చేస్తారు
ప్రత్యేక దర్శనం : సెప్టెంబర్ 4నుంచి అక్టోబర్ 29వరకు (సెప్టెంబర్ 13 నుంచి 26, అక్టోబర్ 18, 19 తేదీలు మినహా) అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 30వ తేదీకి శుక్రవారం జారీ చేస్తారు.
ఆర్జిత సేవలు : అక్టోబర్ 30వ తేదీకి శుక్రవారం జారీ చేస్తారు
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనం, సేవ, కాటేజీలు, రూ.300ల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు 56రోజుల ముందుగా పొందవచ్చు. రిజర్వేషన్ చేసుకోవౄచ్చు. ప్రతి సోమవారం విశేషపూజలు, బుధవారం అష్టదళపూజ, శుక్రవారం నిజపాద దర్శనం, ప్రతిరోజు సుప్రభాతం, కల్యాణోత్సవం సేవలు జరుగుతాయి.
రూ.50, రూ.300ల దర్శనం టిక్కెట్టుకు అదనంగా రూ.50చెల్లిస్తే ఉచితంగా ఇచ్చే రెండు లడ్డూలతోపాటు ఒక్కో టిక్కెట్టుకు రెండు లడ్డూ టోకెన్లు పొందవచ్చు
ప్రతిగురువారం రూ.50 సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేయబడవు.
కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక వ్యక్తి అందరి ఆధార్‌కార్డులతో కేంద్రానికి వస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఆరుటిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు.
ఈదర్శన్ కౌంటర్ పనిచేయు వేళలు : సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలు, తిరిగి మధ్యాహ్నం 2గంటలనుండి సాయంత్రం 5వరకు పనిచేస్తుంది. శని, ఆదివారాలలో ఉదయం 9గంటలనుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రతి మంగళవారం శెలవు.




