శ్రీ అభయ బస్వేశ్వర స్వామివారి అలంకరణ ఆభరణాల ఊరేగింపు మహోత్సవం.
కోటగిరి డిసెంబర్ 5 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో కొలువైన శ్రీ అభయ బసవేశ్వర స్వామి వారి అలంకరణ ఆభరణాల శోభాయాత్ర మహోత్సవం కనుల విందుగా కొనసాగింది.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భక్తులు భక్తి పరవశ డీజే పాటలు,మంగళ దీపాలతో స్వామివారి వెండి,రాగి ఆభరణాల ఊరేగింపు దేదీప్యమానంగా కొనసాగింది.ఇటీవల శ్రీ అభయ బస్వేశ్వర ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కావడంతో భక్తులు స్వామి వారికి ఇచ్చిన నూతన అలంకరణ ఆభరణాలు సోమవారం రోజున ఊరేగింపుగా కొనసాగించి,డిసెంబర్ 6 మంగళవారం రోజున పూజ్యశ్రీ డా. బసవలింగ అవధూత మహారాజ్ చేతుల మీదుగా అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ఈ ఆభరణాలు అలంకరించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,అయ్యప్ప మాలదార స్వాములు,అభయ బస్వేశ్వర భక్తులు,కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు




