మల్లాపూర్ జనవరి19 (జనంసాక్షి) దేవాదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం, వి.వి.రావుపేట్ గ్రామము, శ్రీ గంగా గౌరీశ్వర స్వామి దేవాలయము యొక్క హుండీని గురు వారము రోజున మధ్యాహ్నం దేవాలయ మండపం లో లెక్కించగా ఆదాయం 9 నెలలకు రూ॥ అక్షరాల ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఉన్నది మాత్రమే వచ్చినది తెలిపారు.. ఇట్టి కార్యక్రమములో దేవాదాయ ధర్మాదాయ శాఖ జగిత్యాల డివిజన్ పరిశీలకులు ఆర్ రవికిషన్ , దేవాలయ కార్యనిర్వహణాధికారి యం.విక్రమ్ మరియు వెంకట్రావ్ పేట్ గ్రామ సర్పంచ్ జి మమత రాజేష్ , వెంపల్లి సర్పంచ్ బిట్లు పరీజన – నరేష్, దేవాలయ చేర్మెన్ ఎల్లాల కృష్ణారెడ్డి అర్ధకులు సిబ్బంది పాల్గొన్నారు.




