Friday, 6 November 2026

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాతీయ బాలల దినోత్సవం

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాతీయ బాలల దినోత్సవం హుజూర్ నగర్ నవంబర్ 14 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాతీయ బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించామని ప్రిన్సిపాల్ పోసాని వెంకటరమణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు వివిధ విచిత్ర వేషధారణలో వచ్చి అందర్నీ అలరించారని తెలిపారు. అనంతరం జరిగిన సాంస్కృత కార్యక్రమాలలో అందరినీ అలరించారు. బాలల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలలో , ఇన్చార్జులు ప్రేమ్ సాగర్, శ్రీనివాసరెడ్డి, సౌజన్య, సంధ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.