Friday, 6 November 2026

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభం..
ఊరుకొండ, నవంబర్ 14 (జనంసాక్షి):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని.. అందులో భాగంగానే రైతుల సౌకర్యం కోసం వరుణ్ కొనుగోలు కిందాలు ఏర్పాటు చేస్తుందని ఎంపీపీ బక్కరాధజంగయ్య, సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డిలు అన్నారు. సోమవారం ఊరుకొండ మండలంలోని జకినాలపల్లి గ్రామంలో సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అధ్యక్షతన ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల ఎంపిపి రాధజంగయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి, మండల కో ఆప్షన్ కలీం పాషా, మండల నాయకులు కదిరె శేఖర్ యాదవ్, కొమ్ము శీను, పోలె శంకర్, కర్ణాకర్ రెడ్డి, పులిజ్వాల చంద్రకాంత్, మొండేళ్ల శ్రీశైలం బండి మల్లేష్, పోలె రాజశేఖర్, ఆలయ ధర్మకర్త రామస్వామి, గుండ్లగుంటపల్లి సర్పంచ్ ఆంజనేయులు, ఐకెపి గ్రామ అధ్యక్షురాలు తలసాని సుమిత్రమ్మ, కౌసల్య, వార్డ్ సభ్యురాలు మరియు గ్రామ రైతులు, ఐకెపి మహిళలు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.