Monday, 2 November 2026

శ్రీ శ్రీనివాసచార్యుల తిరునక్షత్ర వేడుకలు

శ్రీ శ్రీనివాసచార్యుల తిరునక్షత్ర వేడుకలు*
మెట్ పల్లి, జనవరి 01, జనంసాక్షి:
మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామము లో ని అతి పురాతనమైన శ్రీ యేంబేర్ మానార్ సహిత రంగనాయకుల దేవాలయంలో నేడు దేవాలయ నిర్మాత శ్రీ శ్రీనివాసాచార్యుల 146 సంవత్సర తిరునక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయం 1916 సంవత్సరంలో రాజా అనంత కిషన్ రావు దొర పరిపాలనలో నిర్మించబడింది 2006 వరకు నిత్య దూప దీప నైవేద్యాలతో వేలసిల్లినది కాలక్రమేన మండపం శిథిలం కావడం వల్ల దేవస్థానం కమిటీ నూతన మంటపాన్ని నిర్మిస్తున్నది దేవస్థానం వెనుక వైపు స్వామి వారి పాదుకలు స్వయంభుగా వెలసినవి అందుకే ఈ స్థానం లోపల నిర్మాణం జరిగినదని భక్తుల అభిప్రాయం ఇటువంటి మహిమాన్వితమైన దేవస్థానాన్ని దర్శించుకొనుటకు దేవస్థానం జీర్ణోదరణకు ప్రభుత్వము మరియు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో వారి వారి సహాయ సహకారాలు అందించాలని దేవస్థాన కమిటీ వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఇల్లెందుల కృష్ణమాచారి తిరు నక్షత్ర వేడుకలను ఘనంగా జరిపారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ తిరునక్షత్ర వేడుకలలో గన్నారం నరసింహాచారి,ఇల్లెందుల శ్రీనివాస్, బెజ్జరపు మురళి, బాజోజి సురేష్, గన్నారం ఆంజనేయులు, తునికి భూమయ్య, సాయి రమేష్, రాజారెడ్డి, శ్రీరాములు, ఇంకా మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు