Friday, 6 November 2026

శ్రీ సీతారామలయ పునర్నిర్మాణం కోసం స్థపతి సూచనలు

 

రుద్రూర్(జనంసాక్షి): గ్రామ, మండల ప్రజల సహకారం మరియు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో గత కొన్ని రోజులుగా రుద్రూర్ మండల కేంద్రంలోని పలు దేవాలయాల పునర్నిర్మాణం , మరియు అభివృద్ధి వేగంగా సాగుతోంది, ఈ క్రమంలొనే శిథిలావస్థకు చేరిన రుద్రూర్ శ్రీసీతారామలయ పునర్నిర్మాణం కోసం కమిటీ వారు గ్రామ పెద్దల సహకారంతో ముందుకు సాగుతున్నరు. మార్చి 8 వ తేదీన హోమ కార్యక్రమలు నిర్వహించారు, శ్రీరామమందిర
వైష్ణవ ఆగమ శాస్త్రల ప్రకారం నిర్మాణం చేయడానికి, మాజీ విండో చైర్మన్ పత్తిరాము కృషి చేస్తున్నారని, వేదలలో మరియు దేవాలయ నిర్మాణ శాస్త్రలలో పండితులతో సంప్రదింపులు చేస్తూ కమిటీకి తగు సహాయం అందిస్తున్నారని అడపా నవిన్, బచ్చు శ్రవణ్, చారి జనంసాక్షి తో తెలిపారు ఈ క్రమంలోనే గురువారం రోజున స్థల పరిశీలన, మరియు వాస్తు, , శంకుస్థాపన ముహూర్తం కోసం స్థపతి విచ్చేసి శ్రీసీతారామలయ కమిటీ వారికి తగు సూచనలు ఇవ్వటం జరిగినదని పత్తి నవిన్ ,అడపా వినోద్, తెలిపారు