వికారాబాద్ రూరల్ మే 08 (జనం సాక్షి)
ప్రజలందరూ శ్రేష్టమైన మిషన్ భగీరథ నీటినే తాగాలని నీటి ట్యాంకులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధికారులను సూచించారు సోమవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా బంట్వారంమండల కేంద్రంలో పర్యటించారు. గ్రామంలో 5,8,10,11,12 వ వార్డులలో నీరు సరిపడా రావడం లేదని ప్రజలు తెలుపగా, మిషన్ భగీరథ అధికారులు ఆ వార్డులో సరిపడా నీటిని అందిచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.మిషన్ భగీరథ త్రాగునీటి ట్యాంకులను ప్రతి నెల 1,11,21 వ తేదీలలో కచ్చితంగా శుభ్రం చేసి, తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలన్నారు.
ప్రజలు మిషన్ భగీరథ మంచి నీటినే త్రాగాలని అందుకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.గ్రామంలోని ఎస్సీ వాడలో విద్యుత్ మెయిన్ లైన్ తోప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపగా, ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.హనుమాన్ మందిరం నుండి బసవేశ్వర విగ్రహం వరకు మరియు బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ వరకు విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మరియు తదితర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నారు.మండలం మరియు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ.మంచి సేవలు అందిస్తున్న విద్యుత్ ఏఈ సురేష్ రెడ్డిని లైన్ మెన్ విక్రమ్ లను అభినందించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క బంట్వారం గ్రామానికి ఇప్పటివరకు పెన్షన్ ల రూపంలోనే9 కోట్లపై చిలుకు అందించడం జరిగిందన్నారు శానిటేషన్ సరైన పద్దతిలో చేయాలని ప్రతిరోజూ చెత్త సేకరించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.బంట్వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతిరోజు సమయానికి రావాలని, ప్రజకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు, ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న ఫార్మసిస్ట్ అమరేందర్ ను అభినందించారు బంట్వారం గ్రామ పంచాయతీకి రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు 13 కోట్ల 24 లక్షల రూపాయలురైతులకు ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు.
మరణించిన 25 మంది రైతు కుటుంబాలకు రైతు బీమా పథకం ద్వారా 1.25 లక్షలు కోటి ఇరవై ఐదు లక్షలురావడం జరిగిందన్నారు.గ్రామంలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాటిని కచ్చితంగా వాడుకలో ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ జెడ్పిటిసి సుజాత పిఎసిఎస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
శ్రేష్టమైన మిషన్ భగీరథ మంచినీటినే త్రాగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్




