Wednesday, 4 November 2026

బైంసాలో కేంద్రమంత్రి బైక్ ర్యాలీ , సభ

భైంసా రూరల్ మే 08 జనం సాక్షి: నిర్మల్ జిల్లా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా కేంద్ర పాడి పశువర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల బిజెపి నాయకులతో, కార్యకర్తలతో భైంసా పట్టణంలోని నాందేడ్ చెక్ పోస్ట్ నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ దగ్గర అంబేద్కర్ కు పూలమాలవేసి సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులతో పాటు బిజెపి కార్యకర్తలు బీడీ కార్మికులు మత్స్య కార్మికులు , ప్రజలు పాల్గొన్నారు.
: ఈ సమావేశంలో కేంద్ర పశు వర్ధక, పాడి పరిశ్రమ మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతు
రాష్టంలో ఉన్న ప్రజలకు అన్ని సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు తీరాలంటే రాష్ట్ర ప్రభుత్వం ను మార్చాలి.తెలంగాణాలో ఉన్న బీడీ కార్మికుల సమస్యలను పార్లమెంట్ లో లేవనేత్తుత భారత దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన సరస్వతి అమ్మవారి ఆలయం మీ వద్ద ఉండడం చాలా గొప్ప విషయం మొదట చిన్నారులకు అక్షర శ్రీకారం చేసి అమ్మవారి ఆశీస్సులు పిల్లలపై ఉండడం అ అమ్మవారిని దర్శించుకోవడం చాలా గొప్ప విషయం
గంగపుత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని,రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రలకు అందించే పథకాలు వారికి అందడం లేదుప్రధాన మంత్రి మత్స్యకారుల సంక్షమాం కోసం 20 వేల కోట్లు అందజేసారు
అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిలయిందని, నష్ట పరిహారం చెల్లించలేదు.. రాష్టంలో ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన అమలు చేయడం లేదు బాసర గోదావరి నది వద్ద వేద భారతి పీఠం చేపట్టిన కార్యక్రమం భరత దేశంలోనే గర్వాకరకారం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పడగంటి రమాదేవి మరియు రామారావు పటేల్ మోహన్ పటేల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు