– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
– వాకర్స్‌కు ఉగాది పచ్చడి పంపిణీ
జనం సాక్షి , మంథని : ఆరు రకాల రుచుల మిశ్రమంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని మంథని పట్టణంలోని కళాశాల మైదానంతో వాకర్స్‌కు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. తీపి, పులుపు,చేదు, వగరు, కారం, ఉప్పు కలయికతో చేసిన రుచుల మాదిరిగానే జీవితంతో కష్టాలు, సుఖాలు, సంతోషం, దుఖంలాంటివాటిని జయించాలని, ఈ కొత్త సంవత్సరంతో ప్రతి ఒక్కరి జీవితాలు షడ్‌రుచుల తరహాలో ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆరు రకాల రుచులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన ఈసందర్బంగా షడ్రుచుల విశిష్టతను వివరించారు. అలాగే మంథని నియోజకవర్గ ప్రజలకు ఈ ఏడాది సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. మంథని నియోజకవర్గం ప్రజలందరికి పుట్ట మధు ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
షడ్రుచులతో సంపూర్ణ ఆరోగ్యం




