Saturday, 7 November 2026

షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ

షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (21): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో టీబి ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులతో పాటు దాతల సహకారంతో జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి సాయినాథ్ రెడ్డి సహాయ సహకారాలతో మండలంలోని 40 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్లను బుధవారం అందజేశారు పోషకార కిట్టులో బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, మంచి నూనె,వంటి బలమైనటువంటి దాదాపు నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉంటాయి ప్రధానంగా పోషకాహారం అత్యంత ముఖ్యమైనదని అందుకే పోషకాహార కిట్లను అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ క్లేవిన్ మార్క్, డాక్టర్ హర్షిత, ఆరోగ్య విస్తరణాధికారి సురేష్ కుమార్, సూపర్వైజర్లు సుచిత్ర, కౌసల్య, ఫార్మసిస్ట్ కవిత, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు