Saturday, 7 November 2026

జిల్లా జడ్పీటీసీల సంఘం ఏర్పాటు. -అధ్యక్షుడిగా తిమ్మాజిపేట్ జడ్పీటీసీ దయాకర్ రెడ్డి.

జిల్లా జడ్పీటీసీల సంఘం ఏర్పాటు. -అధ్యక్షుడిగా తిమ్మాజిపేట్ జడ్పీటీసీ దయాకర్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్21 (జనంసాక్షి):

హైదరాబాద్ లో బుధవారం జరిగిన నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీటీసీ ల సమావేశం లో జిల్లా జడ్పీటీసీ ల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది.జిల్లా జడ్పీటీసీ సంఘం అధ్యక్షుడిగా తిమ్మాజిపేట్ జడ్పీటీసీ దయాకర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి గా పదర జడ్పీటీసీ రాంబాబు ,కోశాధికారి గా నాగర్ కర్నూల్ జడ్పీటీసీ శ్రీశైలం,ఉపాధ్యక్షులు గా పెంట్లవెల్లి జడ్పీటీసీ చిట్టెమ్మ , ఉప్పునుంతల జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి, అచ్చంపేట్ జడ్పీటీసీ మంత్రియా, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం నూతన కార్యవర్గం జిల్లా ఇంచార్జీ జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ ను కలిశారు.