షరపోవా పరాజయం

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ఈరోజు రెండు సంచలనాలు నమోదయ్యాయి. టావ్‌సీడ్‌, షరపోవా పరాజయం పాలైంది. జర్మనీ క్రీడా కారిణి లిసికి చేతిలో 4-6, 3-6 తేడాతో షరపోవా ఓడిపోయింది. బెల్జియం క్రీడాకారిణి కిమ్‌ క్లిస్టర్స్‌ కూడా మరో జర్మనీ క్రీడాకారిణి కెర్భర్‌ చేతిలో 1-6, 1-6తేడాతో పరాజయం పాలైంది. వింబుల్డన్‌ తొలిరౌండ్‌లోనే వీనస్‌ ఇంటిముఖం పట్టడం ఒక సంచలనమైతే ఇప్పుడు షరపోవా, క్లిస్టర్స్‌ ఇద్దరూఐ ఓడిపోవడం ఈ వింబుల్డన్‌లో మరో సంచలన వార్త అయ్యింది.